Current Affairs Telugu Daily

పనామా పత్రాల మొసాక్‌ ఫోన్సెకా మూసివేత
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత కుంభకోణం పనామా పత్రాల వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన మొసాక్‌ ఫోన్సెకా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు 2018 మార్చి 15న ప్రకటించింది.
  • ప్రతిష్ట మసకబారడం, మీడియా ప్రచారం, ఆర్థిక పరిణామాలు, పనమాకు చెందిన కొందరు అధికారుల చర్యల వల్ల కోలుకోలేని నష్టం వాటిల్లడం వల్ల మార్చి నెలాఖరు నుంచి పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
  • అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వినతులపై స్పందించేందుకు చిన్న బృందం కొనసాగుతుందని పేర్కొంది.  
  • 2016 ఏప్రిల్‌ 3న మొసాక్‌ ఫోన్సెకాకు చెందిన డిజిటల్‌ రికార్డుల నుంచి 11.5 మిలియన్‌ పత్రాలు లీకయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల తమ అక్రమ సంపదను కాపాడుకోవడానికి విదేశీ వ్యాపార సంస్థలను సృష్టించిన తీరును అవి కళ్లకు కట్టాయి. 

views: 962

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams