Current Affairs Telugu Daily

మీసేవ ఫిర్యాదుల పరిష్కారంలో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం
మీసేవ ఫిర్యాదు పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, విశాఖపట్నం చివరి స్థానంలో మిగిలింది. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 111 కోట్ల ఫిర్యాదులు మీసేవ ద్వారా వచ్చాయి. వీటిపై ప్రతి 15 రోజులకోసారి..(నెలలో రెండుసార్లు) సీఎం చంద్రబాబునాయుడు సహా సాధారణ పరిపాలన శాఖ కూడా సమీక్షిస్తోంది. మీసేవ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో కృష్ణా, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఉపాధి హామీలో వర్మికంపోస్ట్‌ పిట్స్‌ నిర్మాణంలో కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా నంబర్లు సరిపోకపోవడం వంటి వివిధ కారణాలతో ఆగిన చెల్లింపులను తిరిగి చెల్లించడంలో కూడా కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 

views: 1093

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams