Current Affairs Telugu Daily

ఈ-పెట్టీ కేసెస్‌ యాప్‌ ఆవిష్కరణ
రాష్ట్రంలో చిన్న చిన్న తగాదాలపై నమోదయ్యే ‘పెట్టీ’ కేసులకు చెక్‌పెట్టేలా తెలంగాణ పోలీస్‌శాఖ ఒక యాప్‌ను రూపొందించింది. 2018 మార్చి 14న హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ‘ఈ-పెట్టీ కేసెస్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. 
యాప్‌ ద్వారా పోలీసులు చేసేవి... 
  • ఐపీసీ సెక్షన్లు, సిటీ పోలీస్‌ యాక్ట్‌, గేమింగ్‌ చట్టం, సీఓటీఏపీ-2003 యాక్ట్‌, మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌, టౌన్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద కేసుల నమోదు. 
  • ట్యాబ్‌ ద్వారా ఘటనాస్థలిలో ఫొటోలు, వీడియోలు, వస్తువులు గుర్తించి అప్‌లోడ్‌.  
  • నేరస్తుడి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఆ ప్రాంత జియోట్యాగ్‌ను యాప్‌తో అనుసంధానించడం. 
  • సాక్షులను విచారించి ఘటనా స్థలి నుంచే వారి వాంగ్మూలం సేకరణ. 
  • కేసు నమోదుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రింట్‌ నిందితుడికి అప్పగింత. 
  • ఆటోమెటిక్‌ విధానం ద్వారా అప్‌లోడ్‌ చేసిన అన్ని వివరాలతో కూడిన చార్జిషీట్‌ ఈ-ఫైల్‌ రూపంలో తయారీ. 
  • మరుసటి రోజున నిందితుడు తాను స్వీకరించిన కేసు వివరాల రశీదుతో కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
యాప్ వల్ల ప్రయోజనాలు..
  • అవసరం లేకున్నా పెట్టీ కేసు కట్టాల్సిన పరిస్థితు ఏర్పడవు. 
  • పబ్లిక్‌ న్యూసెన్స్‌కు సంబంధించి హాట్‌స్పాట్లను గుర్తించడం సులభతరమవుతుంది.  
  • పెట్టీ కేసుకు ప్రధాన కారణాలను గుర్తించడం, మరింత తీవ్ర సంఘటనలు జరగకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. 
  • పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెరగడంతో శాంతిభద్రత పరిరక్షణ సులభమవుతుంది. 

views: 1173

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams