Current Affairs Telugu Daily

చైనా లో One Belt, One Road (OBOR) సదస్సు ను బహిష్కరించిన భారత్ 
ఏమిటీ వార్త?
    మే 14-15 తేదీలలో చైనా లోని బీజింగ్ లో జరుగనున్న OBOR సదస్సును భారతదేశం బహిష్కరించనుంది.
వివరాలు 
    OBOR అనునది వాణిజ్యాన్ని పెంచుకొనుటకు  చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి వ్యూహము మరియు కార్యాచరణ ప్రణాళిక.ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం మరియు ఐరోపాలను అనుసంధానించడం మరియు వాణిజ్యాన్ని పెంచుకోవడం దీని లక్ష్యం. OBOR ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్  2013 లో ప్రతిపాదించాడు.
ఈ సదస్సుకు ఎవరు హాజరవుతున్నవారు?
    దాదాపు 65 దేశాలు ఈ సమావేశంలో హాజరవుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, శిఖరాగ్ర సమావేశానికి 20 దేశాల అధిపతులు మాత్రమే హాజరవుతారని  భావిస్తున్నారు.US మరియు జపాన్ లు మొదట సదస్సుకు హాజరు కావడానికి ఇష్టపడలేదు,కానీ చివరి నిమిషంలో ప్రతినిదులను పంపించాలని నిర్ణయించుకున్నారు.రష్యా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ మరియు UK వంటి దేశాలు సదస్సుకు మంత్రులను లేదా అధికారిక ప్రతినిధులను పంపించనున్నాయి.పాకిస్తాన్ నలుగురు ముఖ్యమంత్రులు మరియు ఐదు సమాఖ్య మంత్రులతో కూడిన అతిపెద్ద ప్రతినిధి బృందాన్ని పంపుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మరియు మాల్దీవులు వంటివి కూడా అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తాయి.
ఈ సదస్సుకు ఎవరు హాజరు కావడంలేదు?
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కు సంబంధించి సార్వభౌమాధికార సమస్యల కారణంగా ప్రతినిధిని పంపించటానికి భారతదేశం తిరస్కరించింది.చైనాతో దౌత్య సంబంధాలు లేనందున భూటాన్ పాల్గొనదు.
ఈ సదస్సుకు భారతదేశం ఎందుకు పాల్గొనుట లేదు?
    CPEC అనేది చైనా-పాకిస్థాన్ల మధ్య ౩౦౦౦ కి.మీ ల అతిపెద్ద ప్రాజెక్ట్.ఇది పాకిస్తాన్ లోని  లోతైన నీటి ఓడరేవు అయిన  గ్వాడార్ మరియు చైనా యొక్క జిన్జియాంగ్ జలపాతం లను కలుపుతుంది.ఈ ప్రాజెక్ట్  చైనా యొక్క OBOR పరిధి కింద వస్తుంది.అంతేకాకుండా CPEC ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పోతుంది.OBOR క్రింద గల దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయాసియా లకు సంబందించిన ఇతర ప్రాజెక్టుల వలన కూడా భారతదేశానికి రక్షణ పరమైన సమస్యలు ఉన్నాయి.

views: 1373



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams