Current Affairs Telugu Daily

దయానిధిమారన్‌పై టెలీఫోన్‌ కనెక్షన్ల కేసును కొట్టివేసిన చెన్నై సీబీఐ కోర్టు 
టెలిఫోన్‌ అక్రమ కనెక్షన్ల కేసులో కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధిమారన్‌, ఆయన సోదరుడు కళానిధిమారన్‌పై సీబీఐ పెట్టిన కేసును చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది. మారన్‌ సోదరులు  సహా ఏడుగురికి కేసునుంచి విముక్తి కల్పించింది.
  • కేంద్ర మంత్రిగా దయానిధిమారన్‌ ఉన్న సమయంలో బీఎస్ ఎన్ ఎల్ హైస్పీడ్‌ కనెక్షన్లను అక్రమంగా ఉపయోగించారని గతంలో సీబీఐ ఆరోపించింది.
  • కళానిధిమారన్‌ అప్పట్లో నిర్వహిస్తున్న సన్‌టీవీ డేటా అప్‌లింకింగ్‌ కోసం దయానిధిమారన్‌ తన నివాసం నుంచి 764 టెలీఫోన్‌ లైన్లతో ప్రైవేట్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు చేశారని పేర్కొంది. దీని వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌, డిల్లీ ఎంటీఎన్‌ఎల్‌కు రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.
  • ఈ కేసులో మారన్‌ సోదరులతో పాటు చెన్నై బీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ జనరల్‌ మేనేజర్‌ బ్రహ్మనాథన్‌, మాజీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వేలుస్వామి, దయానిధిమారన్‌ ప్రత్యేక కార్యదర్శి గౌతమన్‌, సన్‌ టీవీ సీనియర్‌ టెక్నికల్‌ అధికారి కన్నన్‌, ఎలక్ట్రీషియన్‌ రవిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
  • చెన్నై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆ ఏడుగురిపై ఛార్జిషీటు దాఖలైంది.
  • ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ 2017 అక్టోబరులో ఆ ఏడుగురు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నటరాజన్‌ 2018 మార్చి 14న తీర్పు ఇచ్చారు.
  • ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలను ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందన్నారు. అందువల్ల ఏడుగురికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams