Current Affairs Telugu Daily

ఏప్రిల్‌ 1 నుంచి సౌదీ అరేబియా టూరిస్టు వీసాలు జారీ
మొట్టమొదటిసారి సౌదీ అరేబియా తమ దేశంలో పర్యటించే ముస్లిమేతర పర్యాటకులకు టూరిస్టు వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. అరేబియన్‌ అడవి అందాలతో పాటు చారిత్రక స్థలాలైన జిద్దా, రియాద్‌,మదాయిన్‌ సలేహ్ నగరాలను సందర్శించేందుకు వీలుగా మొట్టమొదటిసారి పర్యాటక వీసాలు జారీ చేయనుంది.
  • మహిళలు కూడా సౌదీ పర్యటనకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారితో ఎవరైనా పురుషు తోడు ఉండాలనే నిబంధన విధించింది.
  • క్రీడల్లో సౌదీ మహిళలు పాల్గొనడంతోపాటు వారు డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతిస్తూ సౌదీ రాజు ముహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలు జారీ చేశారు.
  • అంతర్జాతీయ క్రీడ పోటీలకు సౌదీ మహిళా క్రీడాకారిణులను పంపించిన సౌదీ సంస్కరణ బాటలో భాగంగా తాజాగా ముస్లిమేతరులకు కూడా టూరిస్టు వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది.
  • ముస్లిమేతర సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లో పవిత్ర మక్కా, మదీనాకు అనుమతించబోమని సౌదీ స్పష్టం చేసింది.

views: 964



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams