Current Affairs Telugu Daily

ఉద్దేశపూర్వక ఎగవేతదార్లకు నేమ్‌ అండ్‌ షేమ్‌
ఉద్దేశపూర్వక ఎగవేతదార్లకు ముకుతాడు వేసేందు కోసం అలాంటి వారి పేర్లను, ఫొటోగ్రాఫులను, ఇతర వివరాలను పత్రికల్లో ప్రచురింపజేయాలని(నేమ్‌ అండ్‌ షేమ్‌) బ్యాంకులకు ప్రభుత్వం సూచన ఇచ్చింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ ఆర్థిక శాఖ లేఖ రాసింది.
  • ఎగవేతదార్ల చిత్రాల ప్రచురణకు బ్యాంకు ఆయా బోర్డు అనుమతులు తీసుకోవాలని అందులో తెలిపింది.
  • డిసెంబరు 2017 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎగవేతదార్ల సంఖ్య 9,063 మందికి పెరిగింది.
  • రూ.50 కోట్లు అంత కంటే ఎక్కువ రుణాలను తీసుకున్న వారి పాస్‌పోర్ట్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
  • నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ, జతిన్‌ మెహతాలు దేశం వదిలి వెళ్లి బకాయిల వసూలును సంక్లిష్టం చేసిన నేపథ్యంలో ఆ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. 

views: 959



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams