Current Affairs Telugu Daily

LoUల జారీపై బ్యాంకులపై RBI నిషేధాజ్ఞలు
లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌(LoU) రూపంలో హామీలను జారీ చేయకుండా ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) నిషేధం విధించింది. నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీలు పీఎన్‌బీకి చెందిన ఒక శాఖ ద్వారా ఎల్‌ఓయూను ఇప్పించుకుని భారీ కుంభకోణానికి  పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఈ తరహా మోసాలు జరగకుండా ఉండేందుకే తక్షణం అమల్లోకి వచ్చేలా వీటిపై నిషేధం జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని షరతులకు లోబడి లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌ఓసీ), బ్యాంకు హామీలు కొనసాగుతాయని RBI పేర్కొంది. నీరవ్‌, మెహుల్‌కు చెందిన కంపెనీలు ఎటువంటి నగదును హామీగా పెట్టకుండా, ముందస్తు రుణ పరిమితి లేకుండా మోసపూరిత ఎల్‌ఓయూను పొందారన్న ఆరోపణలున్నాయి. 
  • సాధారణంగా భారత దిగుమతిదార్లకు ఎల్‌ఓయూలు ఉపకరిస్తుంటాయి. దిగుమతిదారులకు చెందిన బ్యాంకు జారీ చేసే ఎల్‌ఓయూ ఆధారంగా ఆ బ్యాంకు విదేశీ శాఖలుదిగుమతిదార్లకు నగదు ఇస్తుంటాయి.
  • తద్వారా విదేశీ కరెన్సీ రూపంలో సరఫరాదార్లకు చెల్లింపు చేయడానికి వీలవుతుంటుంది.
  • కాగా, తాజా నిబంధనల్లో మార్పు వల్ల దిగుమతి ఆధారిత వ్యాపారాలపై ప్రభావం పడనుంది. ఎల్‌ఓయూపై ఆధారపడి వాణిజ్యం చేసే వ్యాపారులపై దెబ్బపడనుంది.
  • ఎక్కువగా రత్నాభరణాల రంగం ఈ ఎల్‌ఓయూను ఉపయోగించుకుంటూ ఉంటుంది.
  • RBI గవర్నర్‌ - ఉర్జిత్‌ పటేల్‌
  • RBI ప్రధాన కార్యాయం - ముంబయి
  • RBI ఏర్పాటు - 1935 ఏప్రిల్‌ 1
LoU-Letters of Undertaking
RBI-Reserve Bank of India

views: 1062

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams