Current Affairs Telugu Daily

MSMEలకు ICICI బ్యాంక్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (MSME) తక్షణ ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఇన్‌స్టా ఓడీ) సదుపాయం కల్పిస్తున్నట్లు ICICI బ్యాంకు ప్రకటించింది. ఇందుకోసం ఖాతాదారులు బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేదని, ముందస్తు అర్హత (ప్రీ క్వాలిఫైడ్‌) పొందిన వారికి కాగితాలతో పని లేకుండా ఆన్‌లైన్‌లోనే తక్షణం ఓవర్‌డ్రాఫ్ట్‌ పొందే వెసులుబాటు కల్పిస్తున్నామని బ్యాంకు తెలిపింది.
  • ఖాతాదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏడాదికి రూ.15 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించి ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఈ మొత్తాన్ని పొందవచ్చని బ్యాంకు తెలిపింది. 
  • ICICI బ్యాంకు ఛైర్మన్‌ -ఎం.కె.శర్మ
  • ICICI బ్యాంకు ప్రధాన కార్యాలుయం - ముంబై
MSME-Micro, Small and Medium Enterprises
ICICI- Industrial Credit and Investment Corporation of India

views: 904

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams