Current Affairs Telugu Daily

2025 నాటికి రూ.65 లక్షల కోట్ల వార్షిక డిజిటల్‌ లావాదేవీలు
2025 నాటికి వార్షిక డిజిటల్‌ లావాదేవీలు రూ.65 లక్షల కోట్ల (ట్రిలియన్‌ డాలర్లు) స్థాయికి చేరతాయని ఏసీఐ వరల్డ్‌వైడ్‌, ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ నివేదిక పేర్కొంది. అప్పటికి ప్రతి 5 లావాదేవీల్లో 4 డిజిటల్‌ రూపంలోనే జరుగుతాయని అంచనా వేస్తోంది.
  • గ్రామీణ, సెమీ అర్బన్‌ (పాక్షిక పట్టణాలు) ప్రాంతాల వారూ డిజిటల్‌ లావాదేవీలకు ముందుకు వస్తున్నందున, అధిక వృద్ధి లభించనుందని తెలిపింది. అత్యధికులు ఇ-చెల్లింపులు జరిపేందుకు ఫిన్‌టెక్‌ సంస్థలు ఉపకరిస్తున్నాయని, అనువైన నిబంధనావళి.. ముఖ్యంగా యూనిఫైడ్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపులు అత్యధికులకు చేరువ కానున్నాయని విశ్లేషించింది.
  • అనువైన, భారీస్థాయిలో వినియోగించుకునే, విశ్వసనీయ సాంకేతికతపైనే ఈ రంగం భవిత ఆధారపడి ఉందని నివేదిక విశ్లేషించింది. డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నందున, ఈ సేవలు అందించే సంస్థలు సైబర్‌ భద్రతకు అధిక మొత్తాలు వెచ్చించాల్సి వస్తుందని తెలిపింది.
  • డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యవంతమే కాక సురక్షితమని నమ్మకం కలిగిస్తేనే, మోసాలను నివారించగలిగితేనే ఈ లావాదేవీల్లో భారీ వృద్ధి లభిస్తుందని వివరించింది.
  • అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లు, తక్కువ ధరల్లో అధికవేగం డేటా వల్ల డిజిటల్‌ చెల్లింపుల తీరే మారనుందని పేర్కొంది.
  • వేలిముద్రల ఆధారితంగా నిర్వహించేవి, డిజిటల్‌ చెల్లింపునకు బహుళస్థాయి ఆమోదం (OTP వంటివి) వంటివి అవలంబిస్తే, సురక్షిత లావాదేవీలు పెరుగుతాయని తెలిపింది.
  • దేశీయంగా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య - 9 కోట్లు 
  • 2020 నాటికి ఈ సంఖ్య - 30 కోట్లు (అంచనా) 
  • దేశంలో సైబర్‌ దాడుల వల్ల వార్షిక నష్టం - 4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.26,000 కోట్లు) 
  • 2020 నాటికి సైబర్‌దాడుల వల్ల నష్టం - 20 బిలియన్‌ డాలర్లని అంచనా (సుమారు రూ.1.30 లక్షల కోట్లు) 
  • ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల సంఖ్య - 25 కోట్లు 
  • 2020 నాటికి స్మార్ట్‌ వినియోగదార్ల సంఖ్య - 50 కోట్లు 
  • ఏసీఐ సంస్థ ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు, బ్యాంకింగ్‌ సొల్యూషన్లు అందించే అంతర్జాతీయ సంస్థ కాగా, ఏజీఎస్‌టీటీఎల్‌ పూర్తిస్థాయి చెల్లింపుల సొల్యూషన్ల కంపెనీ.
UPI-Unified Payments Interface
OTP- One Time Password

views: 911

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams