Current Affairs Telugu Daily

SBI కనీస నిల్వ ఛార్జీలు తగ్గింపు 
ఖాతాలో నెలవారీ సగటు కనీస నిల్వ (AMB) లేకపోతే విధిస్తున్న ఛార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిర్ణయం తీసుకుంది. 2018 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
  • మహానగరాలు (మెట్రో), పట్టణాల్లో AMB లేకపోతే గరిష్ఠంగా ఛార్జీ రూ.50ం వస్తు సేవల పన్ను (GST) వసూలు చేస్తుండగా, ఇప్పుడు రూ.15+ GST మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందువల్ల 25 కోట్ల మంది ఖాతాదారులకు ఊరట లభిస్తుందని పేర్కొంది. ఇదే విధంగా సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠ ఛార్జీ రూ.40+ GST విధిస్తుండగా రూ.12+ GST, రూ.10+ GSTకి తగ్గించాలని నిర్ణయించారు. 
  • ఎవరైనా ఖాతాదారులు సాధారణ పొదుపు ఖాతాల నుంచి, ఇలాంటి ఛార్జీలు విధించని ప్రాథమిక పొదుపు ఖాతా(BSBD)కి మారాలనుకుంటే, అందుకు అనుమతిస్తారు. ఇందుకు ఛార్జీ ఏమీ వసూలు చేయరు. BSBDలో నెలవారీ కనీస నిల్వ అవసరం ఉండదు. 
  • ప్రస్తుతం SBIలో 41 కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. 
  • వీటిల్లో 16 కోట్ల ఖాతాలు ప్రధాన్‌మంత్రి జన్‌ధన్‌ యోజన/BSBD/పింఛనర్లు/మైనర్లు/సామాజిక భద్రతా పథకాల లబ్ధిదారువి. ఈ ఖాతాకు కూడా AMB షరతులు వర్తించవు.
  • SBI ప్రధాన కార్యాలయం - ముంబై
  • SBI ఛైర్‌ పర్సన్‌ - రజనీష్‌కుమార్‌ 
SBI-State Bank of India
AMB-Average Monthly Balance
GST-Goods and Services Tax
BSBD-Basic Savings Bank Deposit

views: 962



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams