Current Affairs Telugu Daily

దేశంలోనే సంపన్న ఎంపీగా జయాబచ్చన్‌ 
దేశంలోనే సంపన్న ఎంపీగా జయాబచ్చన్‌ నిలవనున్నారు. ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జయాబచ్చన్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న సందర్భంగా ప్రమాణపత్రంలో రూ.వెయ్యి కోట్ల ఆస్తున్నట్లు ప్రకటించారు.
  • ఇంతవరకు అత్యంత సంపన్న ఎంపీగా బీజేపీకి చెందిన రవీంద్ర కిశోర్‌సిన్హా గుర్తింపు పొందారు. 2014లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి తన ఆస్తుల విలువ రూ. 800 కోట్లుగా వెల్లడించారు.
  • 2012లో రూ. 493 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన జయ తాజాగా తనకు, తన భర్త అమితాబ్‌ బచ్చన్‌కు కలిపి రూ.460 కోట్ల స్థిరాస్తులు, రూ. 540 కోట్ల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

views: 1105Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams