Current Affairs Telugu Daily

సిరిస్లిలో రూ.100 కోట్లతో అపెరల్‌ సూపర్‌హబ్‌ 
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో గల పెద్దూరు గ్రామంలో 20 ఎకరాల్లో రూ.100 కోట్లతో అపెరల్‌ సూపర్‌ హబ్‌ను ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని కరూర్‌కు చెందిన ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కేఏవై వెంచర్స్‌ ముందుకొచ్చింది. 30 వేల మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో 2018 మార్చి 13న హైదరాబాద్‌లో సంస్థ ఛైర్మన్‌ సుశీంద్రన్‌, రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైజారామయ్యర్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. 
views: 1093Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams