Current Affairs Telugu Daily

పొగాకుతో ఏటా 71 లక్షల  మంది మృతి : ‘టుబాకో అట్లాస్‌’ నివేదిక 
పొగ తాగడం వల్ల సంభవిస్తున్న ప్రతి మరణం నుంచి ప్రపంచంలోని పొగాకు పరిశ్రమ 9,730 డాలర్ల (రూ. 6.3 లక్షలు) వంతున లబ్ది పొందుతున్నట్లు ‘టుబాకో అట్లాస్‌’ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో పొగాకుకు అలవాటుపడిన ప్రజల నుంచి వాటికి లాభాలు పెరుగుతున్నట్లు వెల్లడించింది.
  • అత్యధిక మరణాలకు సిగరెట్లు తాగడమే కారణంగా తెలిపింది.
  • అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ, యూఎస్‌కు చెందిన వైటల్‌ స్ట్రాటజీస్‌ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన ‘టుబాకో అట్లాస్‌’ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా పొగాకు దుష్ప్రభావాలు పెరుగుతున్న తీరును వివరించింది.
  • పొగతాగే వారే కాకుండా.. ఆ ప్రభావంతో కొందరు.. పొలాల్లో పనిచేస్తున్నవారు మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది.
  • నియంత్రణ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే ప్రాణ, ఆర్థిక నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అట్లాస్‌ రచయిత జెఫ్రీ డ్రోప్‌ పేర్కొన్నారు.
  • సాగు నుంచి వినియోగం దాకా ప్రతిదశలోనూ పొగాకు హాని చేస్తున్నట్లు వైటల్‌ స్ట్రాటజీస్‌ శాస్త్ర సలహాదారు నీల్‌ స్క్జుర్‌ తెలిపారు.
  • 2016లో పొగాకు వినియోగంతో మరణాలు -  71 లక్షలు
  • పొగ తాగనప్పటికీ పరోక్ష ప్రభావంతో మృతులు- 8.84 క్షు
  • ప్రపంచవ్యాప్తంగా పొగతాగుతున్న జనాభా - 110 కోట్లు
  • పొగ తాగకుండా పొగాకును వినియోగిస్తున్నవారు - 36 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలతో ఏటా 2 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 130 లక్షల కోట్లు) ప్రజాధనానికి నష్టం వాటిల్లుతోంది. 
  • 2015లో ప్రపంచంలోని పెద్ద పొగాకు కంపెనీ మొత్తం లాభాలు 62.27 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.03 లక్షల కోట్లు) పైమాటే. 
  • గత ‘అట్లాస్‌’ ప్రకటించే నాటికి సగటున ఒక్కో పొగాకు మరణంపై సంబంధిత పరిశ్రమ 7 వేల డాలర్ల (రూ. 4.5 లక్షలు) లాభాలు పొందగా తాజా నివేదిక సరికి అది 39 శాతం పెరిగింది.

views: 946



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams