Current Affairs Telugu Daily

దేశంలో ఇంటర్నెట్‌ వేగంలో చెన్నైకి ప్రథమ స్థానం
దేశంలో ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్‌ స్పీడ్‌ లభిస్తున్న నగరంగా చెన్నై ప్రథమ స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండోస్థానంలో ఉండగా, హైదరాబాద్‌ మూడో స్థానం పొందింది. నాలుగో స్థానంలో విశాఖపట్నం ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వేగాన్ని గణించే (స్పీడ్‌ టెస్ట్‌) సంస్థ ఊక్లా అధ్యయనంలో ఇది తేలింది. అమెరికాలోని సియాటిల్‌ కేంద్రంగా గల ఈ సంస్థ అధ్యయన నివేదికను 2018 మార్చి 13న విడుదల చేసింది.
  • ఇండియా డిజిటల్‌ డివైడ్‌ పేరిట దేశంలోని 20 నగరాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది.
  • చెన్నైలో ఫిక్స్‌డ్‌ బ్రాండ్‌బ్యాండ్‌లో ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 32.67 మెగాబైట్స్‌ ఫర్‌ సెకను(Mbps)గా ఉంది. అప్‌లోడ్‌ వేగం 26.15 Mbpsగా ఉంది. బెంగళూరులో 31.09, 27.20 Mbpsగా ఉండగా.. హైదరాబాద్‌లో డౌన్‌లోడ్‌ వేగం 28.93 Mbpsగా, అప్‌లోడ్‌ వేగం 25.09 Mbpsగా ఉంది. విశాఖపట్నంలో 26.59,  26.63 Mbpsగా నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో డిల్లీ, కోల్‌కతా, థానె, ముంబయి, వడోదర, సూరత్‌ ఉన్నాయి.
  • ఇంటర్నెట్‌ వేగంలో మొదటి అయిదు స్థానాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలున్నాయి. మొదటి పది స్థానాల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాలు నిలిచాయి.
  • దేశంలో అతి తక్కువ వేగం గల రాష్ట్రాల్లో నాలుగు ఈశాన్య రాష్ట్రాలున్నాయి. మిజోరంలో 3.62, మణిపూర్‌లో 4.30, త్రిపురలో 4.52 Mbps వేగం మాత్రమే ఉందని అధ్యయనంలో  వెల్లడైంది.
ఇంటర్నెట్‌ వేగం ఎక్కువగా వున్న టాప్‌-10 నగరాలు
ర్యాంక్‌    నగరం
1              చెన్నై
2               బెంగళూరు 
3              హైదరాబాద్‌ 
4              విశాఖపట్నం 
5              డిల్లీ 
6              కోల్‌కతా
7              థానె
8              ముంబయి
9              వడోదర
10            సూరత్‌ 
  • ప్రపంచవ్యాప్తంగా ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ వేగంలో ఇండియా 67వ స్థానంలో నిలిచింది.
  • దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సగటు వేగం 20.72 Mbpsగా ఉంది.
  • ప్రపంచంలో అత్యధికవేగవంతమైన ఇంటర్నెట్‌ వేగాన్ని పొందుతున్న దేశంగా సింగపూర్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ సగటున 161.53 Mbps వేగం ఉంది.
  • ఆ తర్వాత స్థానాల్లో ఐస్‌ల్యాండ్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, రొమేనియా, స్వీడన్‌, హంగేరీ, మకావు, అమెరికా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి.
ఇంటర్నెట్‌ వేగం ఎక్కువగా వున్న టాప్‌-10 దేశాలు
ర్యాంక్‌    దేశం
1             సింగపూర్‌
2             ఐస్‌ల్యాండ్‌
3             హాంకాంగ్‌
4             దక్షిణకొరియా
5             రొమేనియా
6             స్వీడన్‌
7             హంగేరీ
8             మకావు
9             అమెరికా
10           నెదర్లాండ్స్‌ 
67           ఇండియా
Mbps-Megabits per second

views: 1042



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams