Current Affairs Telugu Daily

ఆధార్‌ గడువు నిరవధికంగా పెంపు 
బ్యాంకింగ్‌ సహా వివిధ రకాల సేవల్ని, సంక్షేమ పథకాలను పొందడానికి మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ను అందరూ తప్పనిసరిగా అనుసంధానించుకోవాలన్న గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పెంచింది. ఆధార్‌ చట్టాన్ని, బయోమెట్రిక్‌ విధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ పూర్తిచేసి, తుది తీర్పును తాము వెలువరించేవరకు ఈ గడువును పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2018 మార్చి 13న ప్రకటించింది.
  • గత ఏడాది డిసెంబరు 15న వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు... తమ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు వర్తిస్తాయని తెలిపింది.
  • ఆధార్‌ తప్పనిసరంటూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం తగదని పేర్కొంది.
  • మొబైల్‌ సేవల అనుసంధానానికి కూడా గడువు పెంపు వర్తిస్తుంది.
  • తత్కాల్‌ పాస్‌పోర్టుల్ని పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
  • భారత ప్రభుత్వ సంచిత నిధి నుంచి ఖర్చు చేసే వివిధ పథకాల కింద ప్రయోజనాలను లబ్ధిదారులకు బదలాయించడానికి ఆధార్‌ సంఖ్యల్ని అడగడాన్ని ప్రభుత్వం కొనసాగించుకోవచ్చని అనుమతించింది.  

views: 963



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams