Current Affairs Telugu Daily

ఛత్తీస్‌గఢ్‌లో CRPF వాహనం పేల్చివేత..9 మంది జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో కేంద్ర రిజర్వు పోలీసు దళం(CRPF) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని 2018 మార్చి 13న మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు.
  • గస్తీ విధుల్లో భాగంగా CRPF 212వ బెటాలియన్‌ జవాన్లు కిష్టారం నుంచి పలోడికి వెళ్తుండగా దాడి జరిగింది. కిష్టారం-పలోడి మధ్య ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణంలో ఉన్న రోడ్డుపై పాతిపెట్టిన ‘మెరుగుపర్చిన పేలుడు పదార్థాలు(IED)’ను మావోయిస్టులు పేల్చారు.
  • జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం(బంకర్‌) మందుపాతర పేలుళ్ళను తట్టుకునే సామర్థ్యమున్నదే. అయితే, తాజా దాడిలో 50 కిలోకుపైగా పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో.. పేలుడు ధాటికి వాహనం 10 అడుగుల మేర గాల్లోకి ఎగిరి కిందపడి తునాతునకలైంది. 9 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు.
  • 2017 మార్చి 11న సుకమా జిల్లాలోని భేజీ ప్రాంతంలో CRPF గస్తీ బృందంపై మావోయిస్టు మెరుపుదాడి చేశారు. నాటి ఘటనలో 12 మంది జవాన్లు దుర్మరణం పాయ్యారు. అనంతరం 2017 ఏప్రిల్‌ 24న సుకమాలోనే మావోయిస్టు జరిపిన మరో మెరుపుదాడిలో 25 మంది పారామిటరీ సిబ్బంది మృత్యువాతపడ్డారు.
CRPF-Central Reserve Police Force
IED-Improvised Explosive Device

views: 887



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams