Current Affairs Telugu Daily

భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మృతి
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) 2018 మార్చి 14న కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మృతి చెందారు.  
  • స్టీఫెన్‌ పూర్తి పేరు స్టీఫెన్‌ విలియమ్‌ హాకింగ్‌.
  • 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు.
  • కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్‌ భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు.
  • కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నేహాకింగ్‌ రేడియేషన్‌ అని కూడా పిలుస్తారు.
  • భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్‌ పేరుగాంచారు. కృష్ణబిలాలు, బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతంపై ఆయన చేసిన పరిశోధనలు నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేస్తాయి.
  • గ్రహాంతరవాసుల ఉనికిపై చేపట్టే పరిశోధనలు మానవాళికి ముప్పుగా పరిణమిస్తాయని పలుసార్లు హెచ్చరించారు. ఖగోళశాస్త్రంలో ఆయన చేపట్టిన పరిశోధనలు పెను విప్లవం సృష్టించాయి.
  • స్టీఫెన్‌ హాకింగ్‌ రచించిన ‘బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ బ్రిటిష్‌ సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.
  • స్టీఫెన్‌ హాకింగ్‌ రచించిన ఒక పుస్తకం ‘కాలం  కథ’ పేరుతో తెలుగులో కూడా వెలువడింది.
  • స్టీఫెన్‌ హాకింగ్‌ ప్రమాదవశాత్తు నరాల వ్యాధికి గురై 21ఏళ్ల వయసులోనే చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.
  • 1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అదే సమయంలో ఆయన ఒక రోజు మెట్ల మీద నుంచి పడిపోయారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
  • స్టీఫెన్‌ పరిస్థితిని గమనించి కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను సంప్రదించారు.
  • ఆయన మోటార్‌ న్యూరాన్‌ వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంనెమ్మదిగా పక్షవాతానికి గురవుతుంది.
  • ఆ సమయంలో ఆయన కేవలం రెండేళ్లే బతుకుతారని చెప్పారు.
  • అయినా కూడా స్టీఫెన్‌ కుంగిపోలేదు. విధిని ఎదిరించి చక్రాల కుర్చీ నుంచే కదలేని స్థితిలో ఉన్నా కూడా తన పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగించారు.
  • అయితే ఆయన తిరిగి మాట్లాడటానికి మాత్రం కుదరలేదు. దీంతో చేయితో సంజ్ఞులు చేసేవారు.
  • తాను రూపొందించిన ఓ కమ్యూనికేషన్‌ డివైజ్‌ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షరరూపంలోకి మారేవి.
  • కొన్నాళ్లకు ఆ చేయి కూడా పక్షవాతానికి గురికావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్‌ డివైజ్‌ను కంట్రోల్‌ చేశారు.
  • స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు.
  • కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడిరది. అప్పటికి స్టీఫెన్‌ వ్యాధి బయటపడలేదు.అయితే వ్యాధి గురించి తెలిశాక కూడా జానే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నారు. దీంతో 1965లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే కొన్నికారణాల వల్ల 1995లో వీరిరువురు విడిపోయారు.
  • ఆ తర్వాత అదే సంవత్సరం స్టీఫెన్‌.. ఎలైన్‌ మాసన్‌ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. 1980లో స్టీఫెన్‌ అనారోగ్యంలో ఉన్న సమయంలో మాసన్‌ ఆయనకు నర్స్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2006లో మాసన్‌తో కూడా విడిపోయారు.

views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams