Current Affairs Telugu Daily

విశ్వసనీయ ఉద్యోగ సమాచారం కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వం 
ఏమిటీ వార్త?

    సకాలంలో మరియు విశ్వసనీయ  ఉద్యోగిత డేటాను సేకరించుటకు ఒక విధానాన్ని రూపొందించుటకు  NITI Aayog వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ను కేంద్ర  ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వివరాలు 

   ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రక్రియను ప్రారంభించారు మరియు తన సిఫార్సులను త్వరగా సమర్పించమని టాస్క్ ఫోర్స్ ను  కోరారు. టాస్క్  ఫోర్స్ యొక్క ఇతర సభ్యులుః కార్మిక శాఖ కార్యదర్శి M. సత్యవతి, గణాంక శాఖ కార్యదర్శి T.C.A. అనంత్, NITI ఆయోగ్ సభ్యుడు  పులాక్ ఘోష్ మరియు స్టాఫిగ్ కంపెనీ ఆఫ్ టీంలీజ్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మరియు సహ వ్యవస్థాపకుడు  మనీష్ సబర్వాల్.

ఈ టాస్క్ ఫోర్స్ అవసరం ఏమిటి ?

      భారతదేశంలో  ఉద్యోగాలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం లేదు. అందుబాటులో ఉన్న డేటాకు కాలం చెల్లినది. కార్మికుల సంఖ్యలో మెజారిటీ ఉద్యోగులు అసంఘటిత  రంగంలో పని చేస్తున్నారు.ఈ ఉద్యోగుల సమాచారం ను అందుబాటులోకి తేవడం తేలిక కాదు. అలాగే, లేబర్ బ్యూరో విడుదల చేసిన సమాచారం వ్యవస్థీకృత విభాగానికి పరిమితం చేయబడింది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీసు (NSSO)  అత్యంత సమగ్రమైన డేటా ఇస్తుంది కానీ ఇది జాప్యం తో కూడుకున్నది.ఉద్యోగాల డేటాపై మెరుగయిన  సమాచారం,విధాన రూపకర్తలకు   ఉద్యోగాలపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి మరియు అసంఘటిత  ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ పరిమాణం తెలుస్తుంది.

భారత కార్మిక వ్యవస్థ సరళి ఏమిటి?

    భారతదేశ కార్మిక విపణిలో  470 మిలియన్ల మంది ఉన్నారు. CRISIL ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రామిక శక్తిలో 18 మిలియన్ల మంది చేరుతారు. NSSO  డేటా ప్రకారం భారతదేశం 1999-2000 మరియు 2004-05 మధ్య 59.9 మిలియన్ ఉద్యోగాలు సృష్టించింది మరియు 2004-05 మరియు 2009-10 మధ్య దాదాపు రెండు మిలియన్ల ఉద్యోగాలను సృష్టించింది. 2009-10 మరియు 2011-12 మధ్య దేశంలో 13.9 మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.

views: 963

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams