కుల్భూషణ్ జాధవ్ యొక్క ఉరి శిక్ష పై 'స్టే' విధించిన అంతర్జాతీయ న్యాయస్థానం
ఏమిటీ వార్త?
భారత మాజీ నౌకాదళ అధికారి కుల్భూషణ్ జాధవ్ కు పాకిస్తాన్ మరణ శిక్ష విధించింది .అయితే అంతర్జాతీయ న్యాయస్థానం (ది హేగ్ ) ఈ మరణ శిక్ష అమలు పై 'స్టే 'విధించింది.
వివరాలు ఏమిటి?
ఈ మరణ శిక్ష పై పాకిస్తాన్ వైఖరికి వ్యతిరేకంగా భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే నేతృత్వంలోని న్యాయవాదుల బృందం, పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దౌత్య సంబంధాలపై జెనీవా సమావేశ తీర్మాన ఉల్లంఘనలను కూడా వారు సూచించారు.దౌత్యానికి సంబంధించి భారత్ చేసిన 15 ప్రయత్నాలను పాకిస్తాన్ తిరస్కరించింది.మరణశిక్ష విధించబడే వరకు జాధవ్ అరెస్టు మరియు విచారణకు సంబంధించిన వివరాలను ఇవ్వడానికి కూడా పాకిస్తాన్ నిరాకరించింది.
. పాకిస్తాన్ విషయానికి వస్తే భారతదేశం అరుదుగా ICJ ను సంప్రదించింది. భారత్ తన ద్వైపాక్షిక సంబంధాలను "అంతర్జాతీయీకరించేందుకు" ఎల్లప్పుడూ సంశయించింది. అయితే జాదవ్ కేసు స్వభావం భారత్ ను ICJ ను సంప్రదించడాన్ని ప్రేరేపించింది.
కేసు పూర్వాపరాలు ఏమిటి?
బెలూచిస్తాన్( పాకిస్తాన్)లో తీవ్రవాదం మరియు భారతదేశ గూఢచార సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కు గూఢచర్యం నెరపుతున్నాడనే ఆరోపణలపై 3 మార్చి 2016 న ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ సమయంలో. అరెస్ట్ చేయబడ్డాడు.ఏప్రిల్ 10, 2017 న, పాకిస్తాన్ లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ (FGCM) చేత మరణ శిక్ష విధించబడింది.మే 10, 2017 న, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మరణశిక్షకు వ్యతిరేకంగా స్టే ఇచ్చింది.
కుల్ భూషణ్ జాధవ్ ఎవరు?
జాదవ్ మహారాష్ట్రలోని సాంగ్లీలో 1970 ఏప్రిల్ 16 న జన్మించాడు.అతని తండ్రి ఒక రిటైర్డ్ ముంబై పోలీస్ అధికారి.పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, 1987 లో జాదవ్ ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు మరియు 1991 లో భారత నావికా దళం యొక్క ఇంజనీరింగ్ విభాగంలో నియమితుడయ్యాడు. పార్లమెంటుపై దాడి తరువాత, అతను భారతదేశం లోపల సమాచారం మరియు గూఢచారాన్ని సేకరించడం ప్రారంభించాడు. 14 సంవత్సరాల సేవ తరువాత, అతను 2003 లో గూఢచార కార్యకలాపాలలోకి ప్రవేశించి ఇరాన్ లోని చబహార్లో ఒక చిన్న వ్యాపారాన్ని స్థాపించాడు. చబాహార్ నుండి, అతను పాకిస్తాన్ లో అనేక గుర్తించని సందర్శనలను చేసాడు, అక్కడ తన కార్యకలాపాలు కరాచీ మరియు బలూచిస్తాన్ కు మాత్రమే పరిమితమయ్యాయి.
views: 1025