Current Affairs Telugu Daily

మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్‌ మార్టిన్‌ షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్ష
అమెరికా అత్యంత అసహ్యించుకునే వ్యక్తి 'ఫార్మా బ్రో' మార్టిన్‌ షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్ష పడింది. పెట్టుబడిదారులను మోసగించినందుకు గాను న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జ్‌ 2018 మార్చి 9న అతనికి ఈ శిక్ష విధించారు. షక్రెలీ నకిలీ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను పంపి పెట్టుబడిదారులను మోసగించాడు.  
  • మార్టిన్‌ షక్రెలీ తను నడుపుతున్న హెడ్జ్‌ ఫండ్స్‌ నష్టాలను కూడా పెట్టుబడిదారుల వద్ద దాచిపెట్టాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాడు. దీంతో షక్రెలీకి ఫెడరల్‌ జడ్జి ఈ శిక్ష విధించింది.
  • ఒక జీవితాన్ని నిలబెట్టే హెచ్‌ఐవీ మెడికేషన్‌  డరాప్రిమ్ రేటును రాత్రికి రాత్రి 13 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచడంతో, షక్రెలీ తొలిసారి 2015లో వెలుగులోకి వచ్చాడు. అంటే ఆ మెడిషిన్‌ ధరను దాదాపు 5000 శాతం పెంచేశాడు.
  • ఆ సమయంలో ఫార్మా బ్రోగా పేరున్న టూరింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను షక్రెలీ నిర్వహించేవాడు. ఎయిడ్స్‌ చికిత్స కోసం వాడే ఈ మెడిషిన్‌ రేట్లను ఒక్కసారిగా పెంచడంతో, అమెరికాలో అతన్ని అసహ్యహించుకోని వారంటూ లేరు. దీంతో మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్‌ ఇన్‌ అమెరికాగా పేరులోకి వచ్చేశాడు. అదే సంవత్సరం  డిసెంబర్‌లో సెక్యురిటీస్‌ ఫ్రాడ్‌ కూడా వెలుగులోకి వచ్చింది. 

views: 1059

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams