Current Affairs Telugu Daily

 సుప్రీం కోర్ట్ యొక్క digital filing system  ను  ప్రారంభించిన నరేంద్ర మోడీ 
ఏమిటీ వార్త?
   ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సుప్రీం కోర్టు యొక్క" ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్ మెంట్  ఇన్ఫర్మేషన్ సిస్టం" (ICMIS) ను ప్రారంభించారు. ఈ డిజిటల్ ఫైలింగ్ సిస్టం వలన  సుప్రీం కోర్ట్  మొదటి కాగితరహిత డిజిటల్ కోర్టుగా మారుతుంది.
వివరాలు -
   ప్రధాని మోడీ సుప్రీం కోర్టు వెబ్ సైట్ లో " ఇంటెగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ " ను విజ్ఞాన్ భవన్ లో  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. న్యాయ వ్యవస్థలో అతిపెద్ద మరియు అత్యున్నత అడుగుగా  ICMIS ప్రశంసించబడింది. తదనుగుణంగా, అన్ని హై కోర్టులు, జిల్లా  కోర్టులు, సబ్ డివిజన్ కోర్టులు కొత్త వ్యవస్థతో అనుసంధానించబడనున్నాయి . తరువాత, దేశంలోని అన్ని జైళ్లు ICMIS సాఫ్టవేర్ తో అనుసంధానం  చేయబడతాయి.
ICMIS ఉపయోగాలు -
    * దాఖలు, జాప్యాలు మొదలైన వాటి గురించి సమాచారాన్ని పొందటానికి ICMIS దోహదపడుతుంది.

    *ఇది దేశంలోని అన్ని కోర్టుల అనుసంధానానికి  దారి తీస్తుంది.

    * క్రింది కోర్టుల నుండి సుప్రీంకోర్టు లో రికార్డులను  దాఖలు చేయవలసిన అవసరం లేదు.ఎందుకంటే                     రికార్డులను సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ గా  తీసుకోవడం జరుగుతుంది.

    * డిజిటల్,కాగితరహిత వ్యవస్థ  పారదర్శకతకు దారి తీస్తుంది, ఎందుకంటే ఈ  వ్యవస్థతో అవకతవకలు ఏమీ           చేయలేరు.

    * వ్యాజ్యాలను దాఖలు చేసినవారు ఎప్పటికప్పుడు కేసు పురోగతిని  తెలుసుకోగలుగుతారు.

views: 1138



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams