Current Affairs Telugu Daily

గాంధీ అరుదైన ఫొటోకు వేలంలో రూ.27 లక్షలు
భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా సంతకం చేసి ఉన్న అత్యంత అరుదైన ఆయన ఫొటో వాషింగ్టన్‌లో జరిగిన వేలంలో 41,806 డార్లు (సుమారు రూ.27 లక్షలపైచిలుకు) పలికింది.
  • అనాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మదన్‌ మోహన్‌ మాలవీయతో కలిసి మహాత్మాగాంధీ నడుస్తూ వెళుతున్న ఈ ఫొటోను 1931 సెప్టెంబరులో లండన్‌లో తీసినట్లు వేలం నిర్వాహక సంస్థ వెల్లడించింది.
  • అప్పట్లో బ్రిటన్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వెళుతుండగా ఈ ఫొటోను తీశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ తరఫున గాంధీజీ ఆ సమావేశానికి హాజరైనారు. ఈ ఫొటోపై గాంధీ స్వయంగా సంతకం చేశారు.

views: 1373



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams