Current Affairs Telugu Daily

రైలు రిజర్వేషన్‌ టిక్కెట్‌ను బదిలీ చేసుకునే వెసులుబాటు
తాము ప్రయాణించేందుకు వీలుపడని పరిస్థితుల్లో ఎవరైనా తమ ధ్రువీకృత (కన్ఫర్మ్‌డ్‌) రైలు టిక్కెట్‌ను వేరేవారి పేరిట బదిలీ చేసుకునేలా రైల్వేశాఖ వెసులుబాటును కల్పించింది. రైలు ప్రయాణికులకు ఒకింత ఊరటనిచ్చే ఈ సౌకర్యాన్ని పొందేందుకు గాను కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
  • ఈమేరకు తమకు కేటాయించిన సీటు/బెర్తును వేరేవారి పేరు మీదకు మార్చడానికి గాను ముఖ్యమైన స్టేషన్లలోని చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ అనుమతి పొందాల్సి ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
  • రైలు బయల్దేరే సమయానికి 24 గంటల ముందుగా సంబంధిత వ్యక్తులు లేదా అధికారులు  లిఖితపూర్వకంగా వినతులు సమర్పించాల్సి ఉంటుంది.
  • వ్యక్తిగతంగా అయితే ఒక్కసారి మాత్రమే మార్చుకునే వీలుంటుంది. అదే బృందంగా అయితే అందులోని 10 శాతం మందికి మించి అనుమతించరు.
  • ప్రయాణికులెవరైనా తమ కుటుంబ సభ్యుల్లో (తండ్రి, తల్లి, తోబుట్టువు, పిల్లలు, భార్య) ఎవరిపేరిట అయినా మార్పించుకోవచ్చు.
  • పెళ్లి బృందంలో అయితే అందులోని ఎవరిపేరిట అయినా మార్చుకోవచ్చు. అయితే ఆ బృందం పెద్ద దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 
  • ప్రభుత్వోద్యోగులైతే లిఖితపూర్వక వినతి ద్వారా వేరేవారి పేరిట మార్పించుకోవచ్చు.
  • విద్యార్థులైతే తాము చదువుతున్న విద్యాసంస్థలకు చెందిన ఎవరి పేరిట అయినా మార్చుకోవచ్చు. అయితే సంబంధిత అధిపతి అనుమతి తప్పనిసరి. అలాగే ఎన్‌సీసీ బృందంలోని సభ్యులు కూడా తమ అధికారి అనుమతితో సహచరుల పేరిట మార్చుకోవచ్చు.

views: 1090

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams