Current Affairs Telugu Daily

కర్ణాటకకు ప్రత్యేక జెండా
కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2018 మార్చి 8న బెంగళూరులో ఆవిష్కరించారు.
  • ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది.
  • రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలన్నది కన్నడిగుల  అభిప్రాయం, ఆకాంక్ష అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
  • రాష్ట్రాలకు ప్రత్యేక పతాకం ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.
  • జాతీయ జెండానే అత్యున్నతమనీ, రాష్ట్ర జెండా కంటే ఎత్తులో ఉంటుందనీ వివరించారు.
  • ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది.

views: 1251

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams