Current Affairs Telugu Daily

విమానయాన సంస్థలపై  CCI జరిమానా 
కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(CCI) 3 విమానయాన సంస్థలపై రూ.54 కోట్ల మేర జరిమానా విధించింది. సరుకు రవాణాపై సర్‌ చార్జీ విధించే విషయమై అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు CCI ఈ జరిమానా విధించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌పై రూ.39.81 కోట్లు, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో)పై రూ.9.45 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.5.10 కోట్ల చొప్పున జరిమానాను CCI వడ్డించింది.
  • ఇదే ఫిర్యాదుపై మూడేళ్ల కాలంలో CCI ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇలాంటి పోటీ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయా విమాన సంస్థలను CCI ఆదేశించింది.  అయితే అప్పుడు విధించిన జరిమానా(రూ.257 కోట్లు) కంటే ఇప్పుడు వడ్డించిన జరిమానా తక్కువ. 2015 నవంబర్‌లో సీసీఐ (అప్పట్లో కాంపిటీషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) జెట్‌ ఎయిర్‌వేస్‌పై రూ.152 కోట్లు, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌పై రూ.64 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.43 కోట్ల చొప్పున జరిమానా విధించింది.
  • ఈ జరిమానాపై ఆయా కంపెనీలు అప్పీల్‌ చేయడంతో ఆ ఉత్తర్వులను CCI పక్కనపెట్టింది. విచారణ అనంతరం తాజాగా సీసీఐ తక్కువ జరిమానాను విధించింది.
  • ఫ్యూయల్‌ సర్‌చార్జీ ముసుగులో రవాణా చార్జీలను అధికంగా విధించడం వినియోగదారులపై భారాన్ని మోపడమే కాకుండా ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని CCI వ్యాఖ్యానించింది.
  • ఈ విషయంలో నిబంధనలను  ఉల్లంఘించలేదంటూ ఎయిర్‌ ఇండియా, గో ఎయిర్‌పై ఎలాంటి జరిమానాను CCI విధించలేదు. 
CCI-Competition Commission of India

views: 1168



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams