Current Affairs Telugu Daily

యాక్సిస్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులకు భారీ జరిమానా
రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  రెండు దిగ్గజ బ్యాంకులకు భారీ షాక్‌ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనలను పాటించని కారణంగా ప్రయివేటు బ్యాంకు దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకుతోపాటు, ముఖ్య ప్రభుత్వరంగ బ్యాంకులో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకునకు  భారీ జరిమానా విధించింది.
  • కెవైసీ నిబంధనను ఉల్లంఘించిన కారణంగా  ఐవోబీకి  2 కోట్ల రూపాయలు ఫెనాల్టీ విధించింది.  
  • ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు  అంతర్గత తనిఖీ నివేదిక సహా పత్రాల పరిశీలన అనంతరం ఆర్‌బీఐ జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంచినట్టు తేలిందని ఆర్‌బీఐ పేర్కొంది.
  • ఎన్‌పీఏ అంచనాలకు  సంబంధించిన  యాక్సిస్‌ బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలను  ఉల్లంఘించిందని ఆర్‌బీఐ  ప్రకటించింది. ఇందుకుగాను యాక్సిస్‌ బ్యాంకునకు రూ.3 కోట్ల జరిమానా విధించింది.

views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams