Current Affairs Telugu Daily

మహిళలకు బిల్‌గేట్స్‌ వెయ్యి కోట్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్‌ భారీ విరాళం ప్రకటించారు. మహిళలు ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా నాలుగు దేశాలకు 170 మిలియన్‌ డాలర్ల(అంటే వెయ్యికిపైగా కోట్ల) ప్రాజెక్ట్‌ను బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. ఈ నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఉంది. 2018 మార్చి 6న బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ ప్రకటన చేసింది.
  • ఇండియా, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో లింగ సమానత్వం పెరగడం, డిజిటల్‌ ఆర్ధిక సమ్మేళనం విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, వ్యవసాయ రంగానికి, మహిళల మద్దతు సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. 

views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams