Current Affairs Telugu Daily

జాతీయ పోషకాహార కార్యక్రమం ప్రారంభం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి 2018 మార్చి 8న రాజస్థాన్‌లోని ఝుంఝుంనూలో జాతీయ పోషకాహార కార్యక్రమం (NNM) ప్రారంభించారు.
  • ‘బేటీ బచావో-బేటీ పడావో’ను పథకాన్ని సమర్థంగా అమలు చేసిన జిల్లా కలెక్టర్లకు మోడి ఉత్తమ పనితీరు ధ్రువపత్రాలను అందజేశారు.
  • బాల-బాలికల లింగనిష్పత్తి మెరుగైన జిల్లాల కలెక్టర్లకు కూడా మోడి అవార్డులను ప్రదానం చేశారు. వీటిని అందుకున్న 11 రాష్ట్రాల వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారూ ఉన్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లోని కోటాభర్రీకి చెందిన కున్వర్‌భాయ్‌ మరుగుదొడ్లను కట్టుకోడానికి తనకు ఏకైక జీవనాధారంగా ఉన్న మేకలను అమ్మేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోడి గుర్తుచేసుకున్నారు. 106 ఏళ్ల కున్వర్‌భాయ్‌ ఇటీవలే మృతి చెందారు. 
  • బాలల్లో పోషకాహారలోపం, సరైన బరువు, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు 2017 డిసెంబరులో కేంద్రం NNMకు ఆమోదం తెలిపింది. దీనికి బడ్జెట్‌లో రూ.9,046 కోట్లు కేటాయించింది. దీనిద్వారా మూడేళ్లలో 10 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందుతారని అంచనా. తొలిదశలో 315 జిల్లాల్లో ఈ పథకం అమలు కానుంది.
  • కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి- మేనకాగాంధీ 
NNM-National Nutrition Mission

views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams