భారత కుబేరుల్లో అత్యంత పిన్న వయస్కుడు పేటిఎం వ్యవస్థాపకుడు
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్శర్మ(39) భారత కుబేరుల్లో పిన్న వయస్కుడిగా, ఆల్కెమ్ లేబొరేటరీస్ గౌరవ ఛైర్మన్ సంప్రదసింగ్ (92) అత్యంత పెద్ద వయస్సు వ్యక్తిగా నిలిచారు. ప్రపంచంలోని 2,208 మంది కుబేరుతో ఫోర్బ్స్ సంస్థ జాబితాను విడుదల చేసింది. 1.7 బిలియన్ డాలర్ల సంపదతో విజయ్ శేఖర్శర్మ ఫోర్బ్స్ జాబితాలో 1,394వ స్థానాన్ని పొందారు. 40 ఏళ్ల లోపు కుబేరులు 63 మంది ఉండగా, భారతీయుల్లో విజయ్ శేఖర్శర్మ ఒక్కరే ఉన్నారు.
2011లో మొబైల్ వాలెట్ పేటీఎంను స్థాపించిన శర్మకు, ఆ సంస్థలో 16 శాతం వాటా ఉంది.
పేటిఎం ఆర్థిక సేవ సంస్థ. పెద్దనోట్ల రద్దు సమయంలో, కొనుగోళ్లు-చెల్లింపుకు పేటీఎం వాడకం విస్తృతమైంది.
25 కోట్ల మంది నమోదిత వినియోగదారులుండగా, రోజూ 70 లక్షల లావాదేవీలు ఈ సంస్థలో జరుగుతున్నాయి. ఆ సంస్థ విలువ 9.4 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. ఇదేకాక వస్తువుల విక్రయాలకు, ఇకామర్స్ పోర్టల్ పేటీఎం మాల్‌ను స్థాపించారు.
1.2 బిలియన్ డాలర్ల సంపదతో సంప్రదసింగ్ 1,867వ స్థానంలో నిలిచారు.
ఔషధ సంస్థ ఆల్కెమ్ లేబొరేటరీస్‌ను 45 ఏళ్ల క్రితం సింగ్ స్థాపించారు.
మొదట ఒక ఔషధ విక్రయశాలలో పనిచేసిన సింగ్, తరవాత ఔషధ పంపిణీ వ్యాపారాన్ని చేపట్టారు. అనంతరం జనరిక్స్ తయారీ ప్రారంభించారు.
అత్యధికంగా విక్రయమయ్యే యాంటీబయోటిక్స్ క్లావమ్, టాక్సిమ్ను ఆల్కెమ్ లేబొరేటరీస్ తయారు చేస్తోంది.