Current Affairs Telugu Daily

వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సు రైతుల కోటాలో మార్పు
వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో రైతుల కోటా రిజర్వేషన్‌ పొందాలంటే కనీసం 3 ఎకరాల సొంత సాగుభూమి ఉండాలనే పరిమితిని ఎకరానికి తగ్గిస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ 2018 మార్చి 7న ఉత్తర్వులు జారీచేసింది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3 ఎకరాల పరిమితి ఉండటం వల్ల ఎక్కువ మంది రైతుల పిల్లలకు ఈ రిజర్వేషన్‌ వర్తించడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
  • ఈ నేపథ్యంలో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం భూ పరిమితిని రద్దు చేస్తూ కనీసం పట్టాదారు పాసు పుస్తకం ఉంటే చాలని.. అది ఉన్న విద్యార్థులందరికీ ఈ రిజర్వేషన్‌ వర్తింపజేస్తామని నిర్ణయించి ప్రభుత్వ అనుమతి కోరింది.
  • కానీ భూమి పరిమితి నిర్ణయించకపోతే కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, కనీసం ఎకరం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది.
  • ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రిజర్వేషన్‌ను అమలు చేయాలని జయశంకర్‌ వర్శిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
  • వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ సీట్లలో 40 శాతం రైతు కోటా కింద భర్తీ చేస్తారు.
  • కచ్చితంగా భూమి ఉన్నవారి పిల్లలకే వీటిని కేటాయిస్తారు.
  • విద్యార్థి పేరుతో లేదా అతని తల్లిదండ్రుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి.
  • విద్యార్థి తాత, నాయనమ్మ, అమ్మమ్మ పేరుతో భూమి ఉంటే రిజర్వేషన్‌ వర్తించదు.
  • ఏదైనా గ్రామ పంచాయతీ పరిధిలోనే 10వ తరగతి వరకు చదివి ఉండాలి.
  • రైతుల పిల్లలకు ఈ కోర్సుల్లో సీట్లు ఇస్తే వారు చదివిన తర్వాత ఆధునాతన శాస్త్రీయ పరిజ్ఞానంతో తిరిగి వ్యవసాయం చేసి పంట దిగుబడులు పెంచుతారని ఈ రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు.

views: 1045

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams