Current Affairs Telugu Daily

కర్ణాటక లోకాయుక్తపై హత్యాయత్నం
కర్ణాటక లోకాయుక్త జస్టిస్‌ విశ్వనాథ షెట్టిపై 2018 మార్చి 7న హత్యాయత్నం జరిగింది. రాజధాని శక్తి కేంద్రం విధానసౌధకు అనుబంధంగా ఉండే లోకాయుక్త కార్యాయంలో విధుల్లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వనాథ షెట్టిపై తేజ్‌రాజ్‌శర్మ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. న్యాయవాదినంటూ లోకాయుక్త కార్యాలయంలోకి ప్రవేశించి.. నేరుగా జస్టిస్‌ చాంబర్‌లోకి వెళ్లి ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
  • ఆర్టీఐ కార్యకర్తగా ప్రచారం చేసుకుంటున్న తేజ్‌రాజ్‌ 14మందితో పాటు కాగ్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతికి సంబంధించి ఆధారాలు సమర్పించినా కేసు కొట్టివేయడంపై లోకాయుక్తతో వాగ్వాదానికి దిగిన అతను కత్తితో దాడి చేశాడు.

views: 922

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams