Current Affairs Telugu Daily

కేంద్ర ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం, కరువు సాయం (డీఏ మరియు డీఆర్‌) 2 శాతం పెంచుతూ ప్రధాని మోడి నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం కరువు భత్యం మూల వేతనంపై 5 శాతంగా ఉంది. దీనికి మరో 2 శాతం జతైంది. 7వ వేతన సంఘం సూచనల మేరకు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
  • డీఏ పెంపుతో 48.41 లక్షల మంది ఉద్యోగులకు, 61.17 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రంపై రూ.6077.72 కోట్ల ఆర్థిక భారం పడుతుంది.
  • పెంచిన డీఏ మొత్తాన్ని 2018 జనవరి 1 నుంచి వర్తింపజేస్తారు.

views: 1061Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams