Current Affairs Telugu Daily

బాలీవుడ్‌ సీనియర్‌ నటి షమ్మీ మృతి
బాలీవుడ్‌ సీనియర్‌ నటి షమ్మీ(89) 2018 మార్చి 6న మృతి చెందారు. పార్శీ కుటుంబంలో జన్మించిన షమ్మీ 200కు పైగా సినిమాలు, పలు టీవీ ధారావాహికల్లో నటించారు. ఉస్తాద్‌ పెట్రో, భాయి-బహెన్‌, దిల్‌ అప్నా ఔర్‌ ప్రీత్‌ పారాయం, హాఫ్‌ టికెట్‌, జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే, ఇతేఫాక్‌, ది బర్నింగ్‌ టైన్‌, కుద్రత్‌ స్వర్డ్‌ తదితర చిత్రాల్లో నటించారు. దేఖ్‌ భాయ్‌ దేఖ్‌, జబాన్‌ సంభాల్‌ కే, శ్రీమాన్‌ శ్రీమతి, కభీ యే కభీ వో, ఫిల్మి చక్కర్‌ లాంటి ధారావాహిలకు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
  • సినీ దర్శకుడు, నిర్మాత సుల్తాన్‌ అహ్మదీను షమ్మీ వివాహం చేసుకుని, ఏడేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు.

views: 1058



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams