Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌కు అగ్రస్థానం 
ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానాన్ని అధిరోహించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. బెజోస్‌ సంపద 112 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.28 లక్షల కోట్లు)  ‘ఫోర్బ్స్‌ 2018 వరల్డ్‌ బిలియనీర్స్‌’ జాబితా వెల్లడించింది. 2017 సంపదతో పోలిస్తే, 39.2 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో 2018 మార్చి 6న వెలువడిన  జాబితాలో అగ్రస్థానానికి బెజోస్‌ చేరారు.
గత 24 సంవత్సరాలలో, 18 ఏళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 2వ స్థానానికి పడిపోయారు. 
  • ఈ ఏడాది జాబితాలోని కుబేరుల సంపద మొత్తం విలువ 9.1 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.591.5 లక్షల కోట్లు). 2017లో ఈ మొత్తం 7.7 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ కుబేరుల సగటు సంపద మొత్తం 4.1 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్‌ పేర్కొంది.
  • ఈ జాబితాలో భారతీయులు 119 మంది చోటు సాధించారు. ఇందులో 18 మంది కొత్తవారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 40.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.60 లక్షల కోట్ల) సంపదతో మొత్తం జాబితాలో 19వ స్థానంలో  ఉన్నారు.
  • దేశీయుల్లో ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ముకేశ్‌ అంబానీ తరవాత స్థానాల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ (18.8 బిలియన్‌ డాలర్లు, 58వ స్థానం), లక్ష్మీ మిత్తల్‌ (18.5 బి.డాలర్లు, 62వ స్థానం), శివ్‌ నాడార్‌ (14.6 బి.డాలర్లు, 98వ స్థానం), దిలీప్‌ సంఘ్వి (12.8 బి.డాలర్లు, 115వ స్థానం) ఉన్నారు.
  • భారత్‌కే చెందిన రామ్‌దియో అగర్వాల్‌ (2124వ స్థానం), తరంగ్‌ జైన్‌, నిర్మల్‌ మిందా, రవీంద్ర కిశోర్‌ సిన్హా సంపద విలువ తలా బిలియన్‌ డాలర్ల మేర ఉంది.
  • 2018 ఫిబ్రవరి 9 నాటి స్టాక్‌ విలువ, ఎక్స్ చేంజ్ రేట్ల ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. మొత్తం 2,208 మంది ఈ జాబితాలో ఉన్నారు. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారని సంస్థ తెలిపింది.
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 3.1 బిలియన్‌ డాలర్ల సంపదతో 766వ స్థానం పొందారు. 2017లో ట్రంప్‌ 544వ స్థానంలో నిలిచారు. మిడ్‌టౌన్‌ మన్‌హటన్‌ స్థిరాస్తి విలువ, గోల్ప్‌ ఆస్తుల నుంచి ఆదాయాలు తగ్గడం వల్ల అప్పటితో పోలిస్తే, ట్రంప్‌ సంపద 400 మిలియన్‌ డాలర్లు తగ్గింది.
  • ఈ జాబితా నుంచి వైదొలగిన వారిలో భారత వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ, పాపా జోన్స్‌ పిజ్జా వ్యవస్థాపకుడు జాన్‌ ష్నాటర్‌, సౌదీ అరేబియా రాకుమారుడు ఆల్వాలీద్‌ బిన్‌ తలాల్‌ అల్‌సాద్‌ ఉన్నారు.
  • ఈ జాబితాలో ఇద్దరు తెలుగువారు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి.రామ్‌ప్రసాద్‌రెడ్డి (2.5 బిలియన్‌ డాలర్లు) 965వ స్థానం, దివీస్‌ ఛైర్మన్‌ దివి మురళి (2.3 బిలియన్‌ డాలర్లు) 1070వ స్థానం పొందారు.

views: 1152

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams