Current Affairs Telugu Daily

పుణె క్యురేటర్‌ సాల్గోంకర్‌పై 6 నెలల నిషేధం 
2017 అక్టోబరు 25న పుణెలో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌కు ముందు బుకీల రూపంలో ఉన్న విలేకరులతో పిచ్‌ సమాచారం పంచుకున్న క్యురేటర్‌ పాండురంగ్‌ సాల్గోంకర్‌పై ఐసీసీ 6 నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది. మ్యాచ్‌ రోజుతో మొదలై 2018 ఏప్రిల్‌ 25తో అతడి సస్పెన్షన్‌ ముగుస్తుందని ఐసీసీ ప్రకటించింది. మ్యాచ్‌ను ఫిక్స్‌ చేసేందుకు సాల్గోంకర్‌ ప్రయత్నించినట్లు ఆధారాలు లేవని, అతను నేరం చేయలేదని నిర్ధరించిన ఐసీసీ.. బుకీ రూపంలో వచ్చిన విలేకరులు తనను పిచ్‌ సమాచారం అడిగిన విషయాన్ని నివేదించకపోవడాన్ని తప్పిదంగా పేర్కొంది. ఈ తప్పిదం కిందే అతడిపై సస్పెన్షన్‌ విధించింది. ఐసీసీ తీర్పును తాను అనుసరిస్తానని సాల్గోంకర్‌ అన్నాడు. 
views: 1084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams