కల్యాణ సుందరం, స్వామినాథన్‌కు భారత శాంతి దూత పురస్కారాలు
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వరంగల్‌కు చెందిన వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘భారత శాంతి దూత’ పురస్కారాలను 2016 ఏడాదికిగాను అంతర్జాతీయ బాలల సంక్షేమ సంఘం స్థాపకులు పాలెం కల్యాణ సుందరం, 2017 ఏడాదికి గాను వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అందుకున్నారు.
చాలా ఏళ్లుగా ఈ పురస్కారాలను అంతర రాష్ట్ర వ్యక్తులకే ప్రదానం చేస్తూ రాగా, జాతీయ స్థాయిలో మొదటిసారిగా కల్యాణసుందరం, ఎంఎస్ స్వామినాథన్‌కు ప్రకటించారు.
తొలిసారిగా వరంగల్ వెలుపల చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాయం తెలుగు శాఖ సహకారంతో మెరీనా తీరంలోని రజతోత్సవ ప్రాంగణంలో 2018 మార్చి 6న ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కల్యాణసుందరానికి ‘భారత శాంతి దూత’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అనారోగ్యం కారణంగా స్వామినాథన్ రాలేకపోవడంతో సొసైటీ అధ్యక్షులు మహ్మద్ సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి ఏఏ సిద్ధిఖీ, ప్రొఫెసర్ సురేషలాల్ స్థానిక తరమణిలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కే వెళ్లి పురస్కారాన్ని అందజేశారు.