Current Affairs Telugu Daily

శ్రీలంకలో ఎమర్జెన్సీ
శ్రీలంకలో 10 రోజుల ఎమర్జెన్సీ విధించారు. క్యాండీ జిల్లాలో మెజారిటీ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించాలని దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంత్రివర్గం అత్యవసర సమావేశంలో నిర్ణయించింది.
  • పర్యాటక ప్రాంతమైన థెల్దినియలో గతవారం ఓ అల్లరిమూక చేతిలో ఓ బౌద్ధుడు మృతి చెందడంతో మతకలహాలు చెలరేగాయి. ఘర్షణలు చెలరేగిన క్యాండీలో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం భద్రతా దళాలను, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండోలను పెద్ద ఎత్తున తరలించింది.
  • శ్రీలంకలో 2011 తర్వాత ఎమర్జెన్సీ విధించడం ఇదే తొలిసారి. 

views: 948

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams