Current Affairs Telugu Daily

బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం
బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం-ఎలక్ట్రానిక్‌ సిటీ మధ్య ఈ హెలికాప్టర్‌ ట్యాక్సీ సేవలను 2018 మార్చి 5న ప్రారంభించారు.
  • కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్‌ సంస్థ ప్రవేశపెట్టిన ఈ హెలీ ట్యాక్సీలతో రోజుకు మూడు ట్రిప్‌లు వేయనున్నారు.
  • బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్‌లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు.
  • ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్‌ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు.    

views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams