Current Affairs Telugu Daily

ఇక నుంచి 45 కిలోల యూరియా బస్తాలు
ఎరువుల సముచిత వాడకాన్ని ప్రోత్సహించేందుకే ఇప్పటి వరకు 50 కిలోలుగా ఉన్న యూరియా బస్తాను 45 కిలోలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బస్తాను రూ.242కు అందిచనున్నట్లు, దీనికి పన్ను అదనమని కేంద్రం పేర్కొంది. 2018 మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. 25 కిలోలకు మించకుండా కొద్ది మొత్తాల్లో యూరియాను చిల్లరగా విక్రయించుకోవచ్చని డీలర్లకు ప్రభుత్వం సూచించింది.
  • ఎరువుల కర్మాగారాలు ఇప్పటికే తమ వద్దనున్న 50 కిలోల బస్తాలను రెండు నెలల్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
  • ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 మిలియన్‌ టన్నుల యూరియా ఉత్పత్తవుతోంది.

views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams