Current Affairs Telugu Daily

భూమిని పోలిన 3 భారీ గ్రహాలు
భూమిని పోలిన 3 భారీ గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన సౌరకుటుంబానికి దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఇవి ఉన్నాయి. ఇవి భూమి కన్నా 1.6, 1.3, 2.1 రెట్లు పెద్దగా ఉన్నాయి. ఈ గ్రహాల ద్రవ్యరాశి భూమి కన్నా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాటిని ‘సూపర్‌ ఎర్త్‌’లుగా పేర్కొంటున్నారు.
  • ఈ మూడు గ్రహాలు జీజే9827 అనే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి.
  • ఇవి తమ మాతృతారకు చాలా దగ్గరగా ఉన్న కక్ష్యల్లో పరిభ్రమిస్తున్నాయి.
  • వీటి కక్ష్య కాలం 1.2, 3.6, 6.2 రోజుల మేర ఉంది. ఫలితంగా వీటిపై తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • భవిష్యత్‌లో జరిగే ఆధునిక పరిశీనల్లో ఈ గ్రహాల వాతావరణాల గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.
  • ఇప్పటివరకూ సౌర కుటుంబం వెలుపల 3500కుపైగా గ్రహాలను కనుగొన్నారు.

views: 1117



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams