Current Affairs Telugu Daily

చైనా రక్షణ బడ్జెట్‌ రూ.11 లక్షల కోట్లు 
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చైనా తన రక్షణ బడ్జెట్‌ను 8.1 శాతం మేర పెంచింది. దీంతో అది భారీగా 175 బిలియన్‌ డాలర్ల (రూ.11లక్షల కోట్లు)కు చేరింది. భారత్‌తో పోలిస్తే ఇది మూడున్నర రెట్లు ఎక్కువ. 2017లో 7 శాతం మేర కేటాయింపును పెంచిన చైనా ఈసారి తన సైనిక ఆధునికీకరణకు మరింత ఊతమిచ్చేందుకు 8.1 శాతం మేర కేటాయింపు పెంచింది. ఈ మేరకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ)కి 2018 మార్చి 5న సమర్పించిన బడ్జెట్‌ నివేదిక పేర్కొంది.
  • రక్షణ వ్యయం విషయంలో అమెరికా తర్వాత ప్రపంచంలోనే 2వ స్థానంలో చైనా ఉంది.
  • 2019 కోసం 686 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను అమెరికా రక్షణ శాఖ కోరింది.
  • తాజా రక్షణ వ్యయం 46 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams