Current Affairs Telugu Daily

స్కాట్లండ్‌ యార్డ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతిగా నీల్‌బసు 
స్కాట్లండ్‌ యార్డ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతిగా భారత సంతతి అధికారి నీల్‌బసు నియమితులయ్యారు. బ్రిటిష్‌ పోలీసు వ్యవస్థలో ఈ పదవిని అత్యంత కఠినంగా భావిస్తారు. ప్రస్తుతం మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న  49 ఏళ్ల నీల్‌బసు స్పెషలిస్ట్‌ ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పించనున్నారు. 2018 మార్చి 21న మార్క్‌ రౌలీ రాజీనామా తర్వాత కౌంటర్‌ టెర్రరిజం జాతీయ విభాగం అధిపతిగా, మెట్రోపాలిటన్‌ పోలీసు స్పెషలిస్టు ఆపరేషన్స్‌ అధిపతిగా ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు.
  • ఈ పదవి చేపట్టనున్న మొట్టమొదటి ఆసియా అధికారి నీల్‌బసు.

views: 1022



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams