Current Affairs Telugu Daily

క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్తకు రూ.7.65 కోట్ల గ్రాంట్‌
క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు గాను భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త నవీన్‌ వరదరాజన్‌కు రూ.7.65 కోట్ల గ్రాంట్‌ మంజూరయింది. టి-సెల్‌ ఇమ్యూనోథెరపీ ప్రభావాన్ని మెరుగుపర్చడంలో చేసే పరిశోధనకు గాను ఆయనకు క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్సాస్‌ (CPRIT) ఈ గ్రాంటును మంజూరు చేసింది.
  • నవీన్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లో కెమికల్‌, బయోమాలిక్యుర్‌ ఇంజినీరింగ్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
  • ఆయన సహచర ప్రొఫెసర్‌ అయిన సంఘ్యుక్‌ చంగ్‌కు CPRIT రూ.5.25 కోట్లను మంజూరు చేసింది.
  • సర్వైకల్‌ క్యాన్సర్‌లో చికిత్సకుగాను పరమాణు లక్ష్యాలను నిర్వచించేందుకు ఆయనకు ఈ సాయం అందుతుంది.
CPRIT-Cancer Prevention & Research Institute of Texas

views: 1127

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams