Current Affairs Telugu Daily

కేప్‌టౌన్‌ చేరుకున్న  INSV తరణి
పూర్తిగా మహిళా సిబ్బందితో నావికా సాగర్‌ పరిక్రమ సాహసయాత్ర చేస్తున్న తెరచాపతో నడిచే నావ INSV  తరణి ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ చేరుకుంది.
  • 2017 సెప్టెంబరు 10న గోవాలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ INSV తరణి యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
  • ఈ నావ హిందూ, ఫసిఫిక్‌, అట్లాంటిక్‌ మహా సముద్రాల్లో దాదాపు 17,500 నాటికల్‌ మైళ్లు ప్రయాణించి 2018 మార్చి 2న కేప్‌టౌన్‌ చేరుకుంది. కేప్‌టౌన్‌ మేయర్‌ హెలెన్‌ జిల్లే, దక్షిణాఫ్రికాలోని భారత హైకమిషనర్‌ రుచిరా కాంబోజ్‌ తదితరులు ఈ నావలో సాహసయాత్ర చేస్తున్న మహిళా బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. సభ్యులను పుష్పగుచ్చాలతో, హోలీ రంగుతో స్వాగతించారు.
  • 2018 మార్చి 14న కేప్‌టౌన్‌ నుంచి భారతదేశానికి ఈ మహిళా బృందం తిరుగుప్రయాణం మొదలుపెడుతుంది.
  • కేప్‌టౌన్‌ దక్షిణాఫ్రికాలో అధిక నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నగరం.

views: 1011



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams