Current Affairs Telugu Daily

లక్నోలో ముగిసిన ‘రెడ్‌ బ్రిగేడ్‌’ ర్యాలీ 
మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా రెడ్‌ బ్రిగేడ్‌ సంఘం ఆధ్వర్యంలో 15 మంది మహిళలు 2018 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌ నుంచి చేపట్టిన ర్యాలీ 2018 మార్చి 2న శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ముగిసింది.
  • సరోజినీనాయుడు జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల దూరం కొనసాగింది.
  • మార్గమధ్యంలో దాదాపు 20వేల మంది మహిళలను కలిసిన రెడ్‌బ్రిగేడ్‌ సభ్యులు మహిళలపై జరుగుతున్న హింస, సంబంధిత అంశాలపై చర్చించారు.
  • ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ రాంనాయక్‌ నివాసంలో ర్యాలీని ముగించారు. 

views: 1045



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams