ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు, కథకుడు, నవలాకారుడు, సాంఘిక సేవా కార్యకర్త దేవరాజు రవి (80) 2018 మార్చి 2న తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని స్వగృహంలో మృతి చెందారు. దేవరాజు రవి 12 నవలలు, 200పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు, పు ఇతర వ్యాసాలు రాశారు. 1959లో రామం అనే నవలతో ప్రారంభమైన ఆయన రచనా వ్యాసాంగం తుదవరకు కొనసాగింది.
డు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు మెవరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్‌వన్ సినిమా పత్రికల్లో ఆయన చేసిన సమీక్షలు పాఠకుల్ని ఆకట్టుకున్నాయి. ఆయన రచనల్ని సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి వంటి ప్రముఖలుమెచ్చుకున్నారు.
నంది అవార్డు కమిటీలో దేవరాజు రవి రెండుసార్లు సభ్యులుగా ఉన్నారు.
తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయిత దేవరాజు వెంకటకృష్ణారావు కుమారుడు రవి.
సాంఘిక కార్యకర్తగా కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి చేశారు.