Current Affairs Telugu Daily

మధుమేహం సవరించిన వర్గీకరణ ఆవిష్కరణ 
మధుమేహ రోగులకు వ్యక్తిగత స్థాయిలో అవసరమైన ప్రత్యేక చికిత్సా విధానాలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు బాటలు పరిచారు. మధుమేహానికి సంబంధించి సవరించిన వర్గీకరణను ఆవిష్కరించారు. ఈ వ్యాధిలో మొత్తం 5 విభిన్న రకాలు ఉన్నాయని తెలిపారు.
  • ప్రస్తుతం మధుమేహాన్ని టైప్‌-1, టైప్‌-2 రకాలుగా మాత్రమే గుర్తిస్తున్నారు.
  • టైప్‌-1 బాధితుల్లో ఇన్సులిన్‌(రక్తంలో చక్కెర స్థాయిను క్రమబద్ధీకరించే హార్మోన్‌) ఉత్పత్తి కాదు. చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మధుమేహ కేసుల్లో టైప్‌-1 కేసులు దాదాపు 10 శాతం ఉంటాయి.
  • టైప్‌-2 బాధితుల్లో ఇన్సులిన్‌ తగినంత స్థాయిలో ఉత్పత్తి కాదు.
  • కొత్తగా మధుమేహం బారినపడ్డ 13,270 మందిపై స్వీడన్‌లోని లండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కూడిన బృందం పరిశోధనలు నిర్వహించింది.
  • వారిలో ఇన్సులిన్‌ నిరోధకత, ఇన్సులిన్‌ ఉత్పత్తి, రక్తంలో చక్కెర నిల్వ, వయసు, అనారోగ్య ప్రారంభం వంటి అంశాలను పరిశీలించింది. వాటి ఆధారంగా మొత్తం రోగులను 5 భిన్న బృందాలుగా వర్గీకరించింది.
  • అందులో 3 బృందాల్లో వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉందని.. మరో 2 బృందాల్లో తీవ్రంగా ఏమీ లేదని తెలిపింది.
  • ఇన్సులిన్‌ను ప్రభావవంతంగా ఉపయోగించుకోలేని స్థితి(ఇన్సులిన్‌ నిరోధకత)లో ఉన్న వ్యక్తులను శాస్త్రవేత్తలు మొదటి రకం మధుమేహుల బృందంలో చేర్చారు. వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తులు మూత్రపిండ సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్సులిన్‌ నిరోధకత కలిగి ఉన్న రోగులకు సరైన చికిత్స అందడం లేదని అభిప్రాయపడ్డారు.
  • ఇన్సులిన్‌ లోటుతో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా మధుమేహ తీవ్రత ఎక్కువగానే ఉందని వెల్లడించారు. వారిని రెండో బృందంగా వర్గీకరించారు.
  • మూడో బృందంలో.. స్వీయ రోగనిరోధకత నాశక మధుమేహంతో బాధపడుతున్నవారిని చేర్చారు.
  • 4, 5వ రకం బృందాల్లో.. వయసు మీదపడేకొద్దీ మధుమేహం బారినపడే వ్యక్తులు సహా ఇతరులను చేర్చారు. వారిలో తీవ్ర ప్రతికూల ప్రభావాలేవీ కనిపించలేదని తెలిపారు.

views: 1037



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams