Current Affairs Telugu Daily

విద్యుదుత్పత్తి శాతంలో సింగరేణికి 5వ స్థానం
విద్యుదుత్పత్తి శాతం(PLF)లో దేశంలోని థర్మల్‌ కేంద్రాల్లో సింగరేణి కేంద్రం 5వ స్థానంలో నిలిచింది. గత ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ కేంద్రం PLF90.70 ఉన్నట్లు వెల్లడించింది. ఒక విద్యుత్కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో ఎంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందనే శాతాన్ని PLFగా వ్యవహరిస్తారు. దేశంలో 90 శాతానికి పైగా విద్యుదుత్పత్తి శాతంను సాధిస్తున్న కేంద్రాలు 5 మాత్రమే ఉన్నాయి. గత 11 నెలల కాలంలో మొత్తం 8725 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 8203 ఎంయూను రాష్ట్రానికి సరఫరా చేసినట్లు సింగరేణి తెలిపింది. సింగరేణికి సొంత బొగ్గు గనులున్నందున తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి అవుతోంది.
PLF -Plant Load Factor 

views: 1052Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams