Current Affairs Telugu Daily

మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు
నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం డిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, లక్నోను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
  • నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో డిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు.
  • ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ, ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్‌ షేరింగ్‌ ఉన్న పెట్రోలింగ్‌ వ్యాన్‌లను, మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

views: 978



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams